రెడ్డి సామాజిక వర్గం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ Revanth Reddy చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ Alleti maheshwar reddy చెప్పారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్లకు, వెలమలకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
చొక్కారావు లాంటి నేతలు Congress కోసం కష్టపడ్డారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియని వాళ్లు ఏదో మాట్లాడితే ఆ వ్యాఖ్యలను పార్టీ వ్యాఖ్యలుగా భావించొద్దన్నారు.ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుందన్నారు.
రెడ్డి సామాజికవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా స్పందించారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్టుగా ప్రకటించారు.
undefined
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
మీ పార్టీలు గెలవాలన్నా రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు.ఈ నెల 22న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
also read:కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం: హై కమాండ్‌కి ఫిర్యాదు చేస్తానన్న వీహెచ్
రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు, నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు కూడా తప్పు బట్టారు. కాకతీయ సామ్రాజ్యం పై అవగాహన లేకే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావులు విమర్శించారు. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో కనీస సమాచారం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు.