Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..టికెట్‌ రాయితీ నేటి నుంచే!

Published : May 24, 2025, 07:07 AM IST
ndore Metro Start

సారాంశం

హైదరాబాద్ మెట్రో టికెట్లపై శనివారం నుంచి 10% రాయితీ అమల్లోకి వచ్చింది. ప్రయాణికులు మాత్రం అసలైన తగ్గింపు లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల కోసం శనివారం నుంచి టికెట్లపై 10 శాతం రాయితీ అమల్లోకి వచ్చింది. ఇటీవల పెరిగిన ఛార్జీలపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ సంస్థ ఈ మేరకు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ధరల పట్టిక ప్రకారం, రాయితీ అనంతరం కనీస టికెట్ రూ.11 కాగా, గరిష్ఠ టికెట్ రూ.69గా ఉంటుంది. ఇది ముందు వరకూ రూ.12 నుంచి రూ.75 వరకు ఉండేదిగా సంస్థ పేర్కొంది.

కానీ విడుదల చేసిన ఈ ధరల పట్టికను చూసిన ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని మార్గాల్లో 10 శాతం తగ్గింపు ప్రకటించినప్పటికీ, వాస్తవంగా ఆ స్థాయిలో రాయితీ ఇవ్వలేదు. ఉదాహరణకు, 24 కి.మీ. కంటే ఎక్కువ ప్రయాణానికి ముందు టికెట్ ధర రూ.75 కాగా, 10 శాతం తగ్గిస్తే రూ.67.5 అవుతుంది. కానీ సంస్థ దీన్ని రూ.69గా చూపించింది.

అలాగే 18 కి.మీ. దాటి ప్రయాణించే వారికి పెరిగిన ధర రూ.60 అయితే, రాయితీతో రూ.54 అవ్వాల్సి ఉంది. కానీ రూ.56కి కుదించారు. కొన్ని మార్గాల్లో మాత్రం టికెట్లపై 10 శాతం తగ్గింపు వర్తించగా, చాలా జోన్లలో మాత్రం ఇది సరిపోలేదు. మరికొన్ని మార్గాల్లో కేవలం 5 శాతం చొప్పునే తగ్గింపునిచ్చారు.ప్రయాణికులు ఈ తేడాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ రాయితీ పేరిట ప్రకటించిన ధరలు వాస్తవంగా పూర్తిగా తగ్గింపు కలిగించట్లేదని అంటున్నారు. టోకెన్లు, కాగితపు టికెట్లు, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు వంటి అన్ని టికెట్ మాధ్యమాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపినప్పటికీ, ప్రయాణికుల అభిప్రాయం వేరేలా ఉంది.

ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ కొత్త ఛార్జీలను రూపొందించినట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో తెలియజేసినా, ప్రజల్లో మాత్రం ఇది సరైన తగ్గింపుగా లేదు అనే భావన ఏర్పడుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్