భార్య డీటైల్స్ ఇచ్చి... ప్రియురాలితో టూర్ ప్లాన్..

Published : Aug 20, 2019, 10:43 AM ISTUpdated : Aug 20, 2019, 01:30 PM IST
భార్య డీటైల్స్ ఇచ్చి... ప్రియురాలితో టూర్ ప్లాన్..

సారాంశం

లింగసూర్‌కు చెందిన దౌల్‌సాబ్‌ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్‌ ఎయి ర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్‌లు బుక్‌ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. 

కట్టుకున్న భార్య ఉండగా.. ప్రియురాలితో టూర్ కి వెళ్దామని ప్లాన్ వేశాడు. భార్య డీటైల్స్, ఐడీ కార్డ్ ఇచ్చి.. ఆమె పేరిట టికెట్ కొని.. ప్రియురాలిని వెంట తీసుకువెళ్లేందుకు ప్లాన్ వేశాడు. కానీ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లింగసూర్‌కు చెందిన దౌల్‌సాబ్‌ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్‌ ఎయి ర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్‌లు బుక్‌ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. 

పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్