కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

Published : Jan 09, 2020, 12:20 PM ISTUpdated : Jan 09, 2020, 05:28 PM IST
కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలపై గురువారం నాడు సీరియస్ అయ్యారు. 

హైదరాబాద్:  పార్టీ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ ప్రశ్నించారు.

also read:మున్సిపల్ పోల్స్: ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు ఉదయం పదిన్నర గంటలకే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకొన్నారు. కానీ, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సమయానికి రాలేదు. 

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు ఆలస్యంగా వచ్చారు. మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడ ఆలస్యంగా వచ్చారు. అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలస్యంగా రావడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు.

ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయమై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలను అడిగారు. ఈ పరిస్థితిపై  ఆయన ఆరాతీశారు.  బుధవారం రాత్రికే హైద్రాబాద్‌కు రావాలని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. కానీ  వాళ్లు మాత్రం రాలేద.

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు కూడ ఆలస్యంగా సమావేశానికి హాజరయ్యారు. ఈ పరిస్థితిపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 

బుధవారం నాడు  రాత్రే హైద్రాబాద్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసినా కూడ ఎందుకు రాలేకపోయారనే విషయమై కేసీఆర్ ఆలస్యంగా వచ్చిన వారిని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పినా కూడ ఆలస్యంగా రావడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?