దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటయిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటయిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇదీ ఒకటన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ కూడా డేంజర్ జోన్‌లో ఉందని కేంద్రమంత్రి హెచ్చరించారు.
ఇక ఇటీవల కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వానికి అడ్డంకి తొలిగింది కాబట్టి పాత సచివాలయ నిర్మాణాన్ని కూల్చివేయాలని చూస్తోందని... అలాకాకుండా పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని కిషన్ రెడ్డి సూచించారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు.
undefined
read more కొడుకు పుట్టిన సంతోషంలో స్వీట్లు పంచిన కానిస్టేబుల్.. 12 మందికి పాజిటివ్
కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని... తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత సచివాలయంలో 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చన్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.
లాక్‌డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు. మాజీ ప్రధాని పీవీకి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని... పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు అంగీకరించిన ప్రధానికి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.