హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు.. గ‌ర్వించద‌గ్గ విష‌య‌మ‌న్న ప్ర‌భుత్వం !

By Mahesh RajamoniFirst Published Oct 15, 2022, 4:09 AM IST
Highlights

Hyderabad: ఏఐపీహెచ్ ఆరు కేటగిరీల్లో ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ కోసం ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరీల్లో మొత్తం 18 మంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా, ఫైనల్ కేటగిరీల వారీగా శుక్రవారం విజేతలను ప్రకటించారు. ఇందులో హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022ను గెలుచుకుంది. 
 

Hyderabad-World Green City Award 2022: అంత‌ర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. ఏఐపీహెచ్ అంద‌జేసే వ‌ర‌ల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022ను గెలుచుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. దక్షిణ కొరియాలోని జేజులో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్)-వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్' కేటగిరీలో హైదరాబాద్ కు 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022', 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్' కేటగిరీలో మరో అవార్డు లభించింది.

ఏఐపీహెచ్ ఆరు కేటగిరీల్లో ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ కోసం ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరీల్లో మొత్తం 18 మంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా, ఫైనల్ కేటగిరీల వారీగా శుక్రవారం విజేతలను ప్రకటించారు. ఇందులో హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022ను గెలుచుకుంది.  ఇత‌ర కేట‌గిరీల‌లో అవార్డులు గెలుచుకున్న న‌గ‌రాల వివ‌రాలను గమ‌నిస్తే.. లివింగ్ గ్రీన్ ఫర్ బయోడైవర్సిటీ (కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్), లివింగ్ గ్రీన్ ఫర్ క్లైమేట్ చేంజ్ (టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో), లివింగ్ గ్రీన్ ఫర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ (బ్రెజిల్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా), లివింగ్ గ్రీన్ ఫర్ వాటర్ (కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా), లివింగ్ గ్రీన్ ఫర్ సోషల్ కోహెషన్ (అర్జెంటీనా, సౌత్ కొరియా, ఫ్రాన్స్), లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ (కెనడా,  ఇరాన్, ఇండియా) లు ఉన్నాయి. 

ఈ అవార్డులు గెలుచుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అనీ, కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం ఆరు కేటగిరీల్లో అత్యుత్తమమైన 'వరల్డ్ గ్రీన్ సిటీ 2022' అవార్డును హైదరాబాద్ గెలుచుకోవడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్' కేటగిరీలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పచ్చదనాన్ని హైదరాబాద్ ఎంట్రీగా సమర్పించారు. ఈ కేటగిరీ నగరవాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, వృద్ధి చెందడానికి అనుమతించే వ్యవస్థలు, ఇత‌ర పరిష్కారాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. 'తెలంగాణ రాష్ట్రానికి హరిత నెక్లెస్' అని పిలువబడే ఓఆర్ ఆర్ పచ్చదనం ఈ కేటగిరీలో ఉత్తమమైనదిగా ఎంపిక చేయబడింది.

ఈ ఘనత సాధించినందుకు మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఏ) బృందాన్ని,MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) అభినందించారు. కాగా, ఓఆర్ఆర్ వెంబడి పచ్చదనాన్ని పెంపొందించేందుకు మంత్రి  కేటీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించార‌రని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. అలాగే, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్గదర్శకత్వంలో భారీ ఎత్తున పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు హరిత హారం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడంపై తెలంగాణ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషికి, కేంద్రీకరణకు ఈ అవార్డు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.
 

click me!