ఎయిర్ హోస్టెస్ కు లైంగిక వేధింపులు

Published : Aug 31, 2018, 02:31 PM ISTUpdated : Sep 09, 2018, 01:50 PM IST
ఎయిర్ హోస్టెస్ కు లైంగిక వేధింపులు

సారాంశం

 అజయ్‌ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్‌, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

ముంబై నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్‌ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్‌ రెడ్డిగా గుర్తించారు. అజయ్‌ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్‌, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అజయ్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.
 

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family