మేడ్చల్‌లో దారుణం: కన్నకూతురిపై అత్యాచారం, హత్య

Published : Jul 21, 2019, 03:47 PM IST
మేడ్చల్‌లో దారుణం: కన్నకూతురిపై అత్యాచారం, హత్య

సారాంశం

కన్న కూతురిని అత్యంత దారుణంగా హత్యచ ేసిన ఘటన మేడ్చల్ లో చోటు చేసుకొంది. శనివారం నాడు మైనర్ బాలిక మృతదేహం దొరకడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. కన్న తండ్రే కూతురిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

మేడ్చల్: మేడ్చల్ లో మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. తండ్రే కూతురిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు సుబ్రమణ్యం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తూఫ్రాన్ కు చెందిన సుబ్రమణ్యంకు ముగ్గురు పిల్లలు.  ఆయన భార్య మృతి చెందింది.అయితే  సుబ్రమణ్యం మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయమై సుబ్రమణ్యాన్ని కూతురు నిలదీసింది. ఈ బాలికతో తాను మహిళతో సహ జీవనం చేయడం సాధ్యం కాదని భావించారు.

దీంతో తన కూతురిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని స్థానికులు  ఆరోపిస్తున్నారు. మైనర్ బాలిక ముఖం చెక్కేసింది. కండ్లు పీకేశారు. అత్యంత దారుణంగా ఆ బాలికను హత్య చేశారు. 

మైనర్ బాలిక మృతదేహం శనివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ బాలిక మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైనర్ బాలికను అత్యంత దారుణంగా  హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ
Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu