కరోనాతో ఓ వ్యక్తి మృతి.. పట్టించుకోని గాంధీ సిబ్బంది, ఏడు గంటలుగా దుర్వాసన

Siva Kodati |  
Published : Jul 14, 2020, 07:17 PM ISTUpdated : Jul 14, 2020, 07:20 PM IST
కరోనాతో ఓ వ్యక్తి మృతి.. పట్టించుకోని గాంధీ సిబ్బంది, ఏడు గంటలుగా దుర్వాసన

సారాంశం

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి మరణించి ఏడు గంటలు దాటినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి మరణించి ఏడు గంటలు దాటినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

కాగా కొద్దిరోజుల క్రితం గాంధీలో కరోనా మృతదేహం మాయం కావడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ 19 మరణించిన వారి మృతదేహాలు మారిపోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో మృతుల బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగడం చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు