కేసీఆర్ గుడి ముందే తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ ఆమరణ దీక్ష

By narsimha lodeFirst Published Jul 14, 2020, 5:57 PM IST
Highlights

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తెలంగాణ ఉద్యమ కారుడు  గుండా రవీందర్ కేసీఆర్ గుడి ముందే ఆమరణ దీక్షకు దిగాడు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తన ఇంట్లోనే కేసీఆర్ కు ఆయన ఆలయాన్ని నిర్మించాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశాడు.
 


మంచిర్యాల: మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తెలంగాణ ఉద్యమ కారుడు  గుండా రవీందర్ కేసీఆర్ గుడి ముందే ఆమరణ దీక్షకు దిగాడు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తన ఇంట్లోనే కేసీఆర్ కు ఆయన ఆలయాన్ని నిర్మించాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశాడు.

పార్టీ కోసం తాను పనిచేసే క్రమంలో తన ఆస్తులను కోల్పోయినట్టుగా ఆయన చెప్పారు. అయినా కూడ పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

గుండా రవీందర్ గతంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు హంగామా చేశాడు.సీఎం క్యాంప్ కార్యాలయం ముందు హంగామా చేసిన రవీందర్ ను పోలీసులు  అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారు. 

 2001 నుండి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడినైనా తనకు ఎలాంటి సాయం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

click me!