Hyderabad fire accident: కాలి బూడిదైన శివపార్వతి థియేటర్

Published : Jan 03, 2022, 07:25 AM IST
Hyderabad fire accident: కాలి బూడిదైన శివపార్వతి థియేటర్

సారాంశం

హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల శివపార్వతి సినిమా థియేటర్ అగ్నికి ఆహుతి అయింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థియేటర్ పూర్తిగా కాలిపోయింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్ బీ కాలనీలోని శివపార్వతి సినిమా థియేటర్ కాలి బూడదైంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.20 గంటల ప్రాంతంలో ఈ Fire Accident సంభవించింది. సిబ్బంది అప్రమత్తమయ్యేలోగానే థియేటర్ కాలి బూడిదైంది. 

మంటలను ఆర్పడానికి మూడు ఫైర్ ఇంజన్లను వాడారు. మంటలను ఆర్పడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. దాదాపు రూ. 2 కోట్ల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. 

ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా ముగిసిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తాళాలు వేశారు. ఆ తర్వాత శివపార్వతి థియేటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. థియేటర్ లోని సీట్లతో పాటు ప్రొజెక్టర్, తెర మొత్తం కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఉద్యోగం చేశావా.? పైస‌లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్‌లో చిక్కిన భారీ అవినీతి తిమింగ‌ళం
తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్‌ అప్‌డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయ‌క‌పోతే కుదరదు