ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహల నిమజ్జనం: ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంజనీకుమార్

By narsimha lodeFirst Published Sep 6, 2021, 3:37 PM IST
Highlights

హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహల నిమజ్జనానికి సంబంధించి ట్రయల్ రన్ ను హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ సోమవారం నాడు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై పెద్ద విగ్రహలను మాత్రమే అనుమతిస్తామని అంజనీకుమార్ తెలిపారు.


హైదరాబాద్: హైద్రాబాద్ ట్యాంక్ బండ్‌పై వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ సోమవారం నాడు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్ ను ఇవాళ నిర్వహించారు.గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ చెప్పారు.

నిమజ్జనం చేసేందుకు ఆటోమెటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్ ను వాడుతున్నామని  సీపీ చెప్పారు. ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల సంఖ్య తగ్గిస్తున్నామని  ఆయన తెలిపారు.కేవలం పెద్ద విగ్రహలకు మాత్రమే ట్యాంక్ బండ్ పైకి అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు

.వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జం చేసే విషయమై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిల్ పై విచారణ సాగుతోంది. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకొని తుది తీర్పు ఇస్తామని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రకటించింది.కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక చవితి వేడుకల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిమజ్జనం విషయంలో కూడ పలు జాగ్రత్తలు తీసుకొంటుంది. 
 

click me!