చర్చికి వచ్చే అమ్మాయిలే టార్గెట్... ఉప్పల్ లో బయటపడ్డ పాస్టర్ కీచకపర్వం

Arun Kumar P   | Asianet News
Published : Sep 06, 2021, 01:32 PM ISTUpdated : Sep 06, 2021, 03:38 PM IST
చర్చికి వచ్చే అమ్మాయిలే టార్గెట్... ఉప్పల్ లో బయటపడ్డ పాస్టర్ కీచకపర్వం

సారాంశం

దేవున్ని ప్రార్థించడానికి చర్చికి వచ్చే మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఓ చర్చి పాస్టర్ పాపం పండి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: ప్రార్ధన చేయడానికి చర్చికి వచ్చే మహిళలే అతడి టార్గెట్. దేవుని సన్నిధిలో వుండే అతి పవిత్రమైన వృత్తిలో వుండి ప్రార్థన కోసం వచ్చే అమ్మాయిలకు గాలం వేస్తూ లోబర్చుకుంటున్నాడు ఓ పాస్టర్. ఇలా ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన సదరు పాస్టర్ పాపం పండి కటకటాలపాలయ్యాడు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ గాస్పల్ చర్చిలో జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్. దేవున్ని ప్రార్థిస్తూ పాపాలను పక్షాళన చేస్తానని చెప్పుకునే అతడే పాపపు పనులకు పూనుకున్నాడు. పాస్టర్ ముసుగేసుకున్న ఈ వంచకుడు చర్చికి వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. ఇలా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న జోసెఫ్ మరికొందరు ఆడపిల్లలను కూడా ట్రాప్ చేసి మోసగించాడు. 

read more  కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్ పై ఛీటింగ్ కేసు.. ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో పెళ్లి..

అయితే పాస్టర్ జోసెఫ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కీచక పాస్టర్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా జోసెఫ్ చేతిలో ఇప్పటికే చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు తేలింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్