బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సోమవారం నాాడు ఈ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు అభిప్రాయపడింది. ఈ పిటిసన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్ పాదయాత్రపై నిన్న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఇవాళ తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.
బండిసంజయ్ పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్ ఆ పిటిషన్ లో పేర్కొంది.ఈ పిటిసన్ ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత విచారణను తెలంగాణ హైకోర్టు చేపట్టింది అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిసన్ పై విచారణను సోమవారం నాడు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
undefined
also read:శాంతి భద్రతల సమస్య: బండి సంజయ్ యాత్ర నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్
ఈ నెల 27వ తేదీతో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. రేపు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 29వ తేదీ నాటికి బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులుఈ నెల 21 న హైద్రాబాద్ లో ఆందోళన చేశారు.ఈ ఆందోళన చేసిన వారిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ కేసులను నిరసిస్తూ బండి సంజయ్ ఈ నెల 23 వరంగల్ లో దీక్షకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బండిసంజయ్ ను కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నందున పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు.ఈ నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు ఈ నెల 23 సాయంత్రం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు.ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. వర్ధన్నపేట ఏసీపీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ ఉదయం నుండి బండి సంజయ్ యాత్రను పున: ప్రారంభించారు. రేపు భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద యాత్రను ముగించనున్నారు బండి సంజయ్.