వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన సీపీ సీవీ ఆనంద్.. ఆ మట్టిని ఏం చేశారంటే?

Published : Sep 28, 2023, 07:07 PM IST
వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన సీపీ సీవీ ఆనంద్.. ఆ మట్టిని ఏం చేశారంటే?

సారాంశం

హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ వినాయకుడిని ఇంటిలోనే నిమజ్జనం చేశారు. ఓ కుండీలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి నీటిని పోశారు. మట్టి విగ్రహం కావడంతో నీటిలో కరిగిపోయాడు. ఆ మట్టిలో తన భార్యను ఓ మొక్కను నాటినట్టు వివరించారు.  

హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తమ ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించి ఓ వివరణ కూడా పెట్టారు.

వీడియోలో చూపిన విధంగా ఇంటిలోనే వినాయకుడిని నిమజ్జనం చేశానని సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరంలో కుండీలోని నీటిలో వినాయకుడు కరిగిపోయాడు. ఆ కుండీలో మిగిలిన మట్టిలో తన భార్య ఓ మొక్కను నాటినట్టు వివరించారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి హానీ కలగకుండా నడుచుకోవడమే కాదు, మొక్కల సంఖ్యనూ పెంచినవారం అవుతామని తెలిపారు.

Also Read: గంగా జమున తెహజీబ్: గణపతి నిమజ్జనంలో భక్తులతోపాటు పోలీసుల స్టెప్పులు.. నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం (Videos)

ఈ సారి గణపతి నిమజ్జన ఊరేగింపుల్లో హైదరాబాద్‌లో పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతోపాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

PREV
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??