మద్యం మత్తులో కారు నడిపిన వ్యకి: హైద్రాబాద్ హబ్సీగూడలో ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి గాయాలు

Published : Dec 04, 2022, 11:40 AM ISTUpdated : Dec 04, 2022, 04:32 PM IST
మద్యం మత్తులో  కారు నడిపిన వ్యకి: హైద్రాబాద్  హబ్సీగూడలో  ఆటోను ఢీకొన్న  కారు, నలుగురికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్  నగరంలోని హబ్సీగూడలో  కారు, ఆటోను ఢీకొట్టింది.  ఈ ఘటనలో  నలుగురు గాయపడ్డారు. మద్యం మత్తులో  కారు నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని  పోలీసులు తెలిపారు.  

హైదరాబాద్:నగరంలోని  హబ్సీగూడలో కారు, ఆటోను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. గాయపడిన  నలుగురిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి  కారును నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

మద్యం మత్తులో  గతంలో  రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలోని  మడికేరి  పట్టణంలో  మద్యం మత్తులో కారును నడిరోడ్డులో  నిలిపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కారును అక్కడిని తొలగించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని  లింగారెడ్డిపేట గ్రామం వద్ద కారు బైక్ ను ఢీకొట్టింది.  మద్యం మత్తులో  ద్విచక్రవాహనంపై వెళ్తున్న నర్ర రతన్ ను కారుతో ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం  ధ్వంసమైంది.

తమిళనాడులోని  విల్లుపురం  జిల్లా ముగైయూర్  సమీపంలోని చిట్టాపూర్  లో  మద్యం మత్తులో  తల్లిని చంపాడు కొడుకు  ఈ ఘటన ఈ నెల 10న జరిగింది.మద్యానికి  బానిసగా మారిన  శక్తివేల్  తల్లితో తరచూ గొడవపడేవాడు. ఈ నెల 10న  శక్తివేల్  తల్లితో  గొడవ పడ్డాడు.ఈ సమయంలో  తల్లిని  చంపాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?