కారణమిదీ: హైద్రాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్, విడుదల

Published : Aug 30, 2020, 10:28 AM IST
కారణమిదీ: హైద్రాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్, విడుదల

సారాంశం

తుపాకీ చూపి ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటన హైద్రాబాద్ లో  చోటు చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైదరాబాద్:తుపాకీ చూపి ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటన హైద్రాబాద్ లో  చోటు చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన ఎస్. రామకృష్ణంరాజు హైద్రాబాద్ శివారులోని  గుండ్ల పోచంపల్లిలో ఓ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్నాడు.ఆయన నాచారంలోని ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 27వ తేదీన ఉదయం కారులో పరిశ్రమకు వెళ్తుండగా కొంపల్లి అండర్ పాస్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు అడ్డగించి తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. 

అతడిని తీసుకెళ్లి రూ. 4 కోట్లు డిమాండ్ చేశారు.  ఇంత మొత్తం తన వద్ద లేదని రూ. 2 లక్షలు సమకూర్చనున్నట్టుగా వ్యాపారి కిడ్నాపర్లకు చెప్పారు.  దీంతో చేసేదీలేక నిందితులు  మధ్యాహ్నం మూడున్నర గంటలకు వ్యాపారిని వదిలేశారు.

నిందితులు వ్యాపారి నుండి పెద్ద మొత్తంలో  డబ్బులు ఆశించారు. కానీ  వ్యాపారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు రావని భావించి వదిలేసినట్టుగా చెబుతున్నారు.

అదే రోజు రాత్రి  పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu