బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ

Published : Nov 23, 2019, 06:24 PM ISTUpdated : Nov 23, 2019, 06:31 PM IST
బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ

సారాంశం

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగన ఘోర ప్రమాదంలో మృతి చెందిన మహిళను గుర్తించారు పోలీసులు. మృతురాలు పేరు 47 ఏళ్ల సత్యవేణిగా పోలీసులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన సత్యవేణి అద్దె ఇంటికోసం హైదర్ నగర్ వెళ్తోంది. 

హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగన ఘోర ప్రమాదంలో మృతి చెందిన మహిళను గుర్తించారు పోలీసులు. మృతురాలు పేరు 47 ఏళ్ల సత్యవేణిగా పోలీసులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన సత్యవేణి అద్దె ఇంటికోసం హైదర్ నగర్ వెళ్తోంది. 
 
ప్రస్తుతం పుప్పాలగూడలో ఉంటున్న సత్యవేణి ఇల్లు మారాలని చూస్తోంది. అందులో భాగంగా హైదర్ నగర్ వెళ్లేందుకు ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం వెయిట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సత్యవేణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె తండ్రి ఒక రెస్టారెంట్ లో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సత్యవేణి కుటుంబం చాలా ఆర్థిక కష్టాల్లో ఉందని అందువల్లే ఇల్లు కూడా మారుతుందని తెలుస్తోంది. 

 హైదరాబాద్: ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డ కారు, విధ్వంసం, మహిళ మృతి

హైదర్ నగర్ వెళ్లేందుకు వేచి చూస్తుండగా ఇలా ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆటో ఎక్కాల్సి ఉండగా కారు రూపంలో మృత్యువు మింగేయడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సత్యవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

ఇకపోతే సత్యవేణి కుటుంబ సభ్యులకు జీహెచ్ఎంసీ రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం:బాధాకరమన్న కేటీఆర్, యాక్సిడెంట్ పై కమిటీ

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu