బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం:బాధాకరమన్న కేటీఆర్, యాక్సిడెంట్ పై కమిటీ

Published : Nov 23, 2019, 06:03 PM ISTUpdated : Nov 23, 2019, 06:04 PM IST
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం:బాధాకరమన్న కేటీఆర్, యాక్సిడెంట్ పై కమిటీ

సారాంశం

 బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఘటన చాలా విచారకరమన్నారు. కారు వేగమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.   

హైదరాబాద్: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఘటన చాలా విచారకరమన్నారు. కారు వేగమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. 

చీఫ్ ఇంజనీర్ల సూచన మేరకు ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇకపోతే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై వేగనియంత్రణతోపాటు రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇకపోతే ప్రమాదం ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్వతంత్ర నిపుణులతో ఒక కమిటీ వేశామని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇకపోతే ఫ్లై ఓవర్ ప్రమాదంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైవేగాన్ని నియంత్రించేందుకు చేపట్టే చర్యల కోసం మూడురోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్: ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డ కారు, విధ్వంసం, మహిళ మృతి

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!