హైదరాబాద్‌: వాహ‌నంలోకి స్క్రాప్ ఎక్కిస్తుండగా పేలుడు.. ఒకరు మృతి

Published : Mar 07, 2023, 04:47 PM IST
హైదరాబాద్‌: వాహ‌నంలోకి స్క్రాప్ ఎక్కిస్తుండగా పేలుడు.. ఒకరు మృతి

సారాంశం

Hyderabad: హైదరాబాద్ లో పాత సామాను కుప్ప (స్క్రాప్) లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన పేలుడులో స్క్రాప్ డీలర్ (30) మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు.  

Blast in scrap pile kills one in Hyderabad: హైదరాబాద్ లో మంగళవారం జరిగిన పేలుడులో స్క్రాప్ డీలర్ (30) ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం నాడు మూసాపేట ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హెచ్ పీ రోడ్డులోని ఓ వాహ‌నంలోకి స్క్రాప్ డీలర్ పాత స‌మానును (స్క్రాప్) ఎక్కిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ వ్యక్తి పాత సామానుతో కూడిన వ‌స్తువుల‌ను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా ఒక కెమికల్ టిన్ కంటైనర్ నేలపై పడటంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వ్యాపారి మహ్మద్ నజీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీని గురించి స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు ముషీరాబాద్ లోని భోలక్ పూర్ కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. నజీర్ తండ్రి ఇస్లామిల్ స్క్రాప్ కొనుగోలు చేసేవాడు. పేలుడు సంభవించిన సమయంలో నజీర్ వాహనంలో మెటీరియల్ ను అప్ లోడ్ చేయడంలో సహాయపడుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో నగరంలో ఇలాంటి ఘటనలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2022 జూన్ 12న అఫ్జల్ గంజ్ ప్రాంతంలోని మ్యాన్ హోల్ లో  రసాయనాలు డంప్ చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. అలాగే, గతంలో కూడా ఇదే తరహా ఘటనల్లో ఇద్దరు చెత్త‌ను సేక‌రించే వారు ప్రాణాలు కోల్పోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!