Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వైద్యురాలిపై వీధి కుక్కల దాడి..

Published : Sep 21, 2022, 11:44 AM IST
Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వైద్యురాలిపై వీధి కుక్కల దాడి..

సారాంశం

Erragadda: ఒక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో వైద్యునిపై వీధి కుక్క‌లు దాడి చేశాయి. రాత్రిపూట వార్డుకు వెళ్తున్న డాక్టర్‌ పై దాదాపు 10 వీధికుక్కల గుంపు దాడిచేసింది. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న రోగి బంధులువు ర‌క్షించ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది.

Doctor was attacked by stray dogs: ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యుడిపై మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వార్డులోకి ప్రవేశిస్తుండగా 7-10 కుక్కల గుంపు దాడి చేసింది. డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ (డీఎంవో) భవనం-వార్డు మధ్య 500 మీటర్ల దూరంలో డాక్టర్ నడుచుకుంటూ వెళ్తుండగా, విచ్చలవిడిగా వచ్చిన కుక్కలు ఆమెపై తిరగబడ్డాయి. అయితే, చనిపోయిన ఒక రోగి సహాయకులు సమీపంలో వేచి ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కుక్క‌ల దాడిని చూసి.. వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి రక్షించడంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే, పెద్ద గుంపుగా ఉన్న కుక్క‌లు.. అప్ప‌టికే వైద్యురాలి కాళ్ల‌ను, తొడ‌లపైనా క‌రిచాయి.

ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి సిబ్బంది మాట్లాడుతూ.. వైద్యురాలిపై కుక్క‌లు దాడి చేయడానికి సంబంధించి మేము చాలా గందరగోళ ప‌రిస్థితిని గురించి విన్నాము. కుక్క‌ల దాడి జ‌రిగిన‌ప్పుడు దానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారు ఆమెను ర‌క్షించారు. అయితే, అప్ప‌టికే వైద్యురాలిని క‌రిచాయి. మేము ఆమెను రక్షించిన తరువాత సంఘటనా స్థలానికి చేరుకున్నాము. సంఘటన తరువాత డాక్ట‌ర్ మాట్లాడలేకపోయింది. రోగి సహాయకులు లేకపోతే ఆమెను రక్షించేవారు కాదు" అని ఆసుపత్రి సిబ్బంది ఈ సంఘటనను వివరిస్తూ చెప్పారు.

ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో విచ్చలవిడిగా కుక్క‌ల గుంపులు.. రాత్రి డ్యూటీకి భయపడుతున్న డాక్ట‌ర్లు 

వైద్యురాలిపై వీధి కుక్క‌ల గుంపు దాడి చేసిన ఘ‌ట‌న దిగ్బ్రాంతికి గురిచేసింది. గత మూడు నెలల నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు వారానికి రెండుసార్లు ఈ వీధి కుక్క‌ల గుంపుల‌ను తీసుకెళ్తున్నాయి. అయినప్పటికీ, పెద్ద ఖాళీ స్థలాలు ఉన్నందున వీధి కుక్క‌ల‌ ముప్పు కొనసాగుతుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. “రాత్రిపూట తగిన భద్రతా సిబ్బంది లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఘటన జరిగిన సమయంలో కూడా ఆమెకు సహాయం చేసేందుకు సమీపంలో సెక్యూరిటీ లేరు. ఆమె కేకలు విన్న తర్వాత కూడా భద్రతా సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఓ పేషెంట్‌ బంధువులే ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు' అని ఉస్మానియా జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సతివాడ అన్నారు.

60 ఎకరాల విస్తీర్ణంలో ఫెన్సింగ్‌లు, భవనాల మధ్య ఖాళీ స్థలాలు లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో రోగులు, వైద్యులు నడవడానికి కుక్క‌లు ప్రమాదకరంగా ఉన్నాయ‌ని ఉద్యోగులు చెబుతున్నారు. రాత్రిపూట ఆస్పత్రి ఆవరణలో కుక్కలు తిరుగుతూ తెల్లవారుజామున వెళ్లిపోవడం నిత్య సమస్య అని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. "ఆహారాన్ని తీసుకువెళ్లడం అంటే కుక్క‌ల దాడిని కొనితెచ్చుకోవ‌డ‌మే. ఆహారంలో అటుగా వెళ్తే కుక్క‌లు దాడి చేస్తున్నాయి. అలాగే, క్యాంపస్‌లో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లడం కూడా భయంకరమైనది. వార్డులకు నడిచి వెళ్లాల్సిన పీజీ వైద్యులు ఇప్పుడు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. చాలా మంది రాత్రి విధులకు హాజరుకావడం లేదు” అని ఒక పీజీ వైద్యుడు చెప్పారు. కుక్కల బెడదను నియంత్రించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు.

గత 3-4 నెలల నుంచి వీధి కుక్క‌ల‌ను పట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మున్సిపల్ కార్మికులను వారానికి రెండు సార్లు పిలుస్తున్నారు. కానీ, ఫెన్సింగ్ లేకపోవడంతో కుక్కలు మ‌ళ్లీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోకి వ‌స్తున్నాయి. ఖాళీ స్థ‌లం ఎక్కువ‌గా ఉంది. కాబట్టి దీనికి కంచే వేయ‌డం.. క్లోజ్డ్ స్పేస్‌లు ఉంటేనే దీన్ని నియంత్రించవచ్చు’’ అని డాక్టర్ ఖాన్ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు