లిఫ్ట్ లో ఇరుక్కొని 9ఏళ్ల బాలిక మృతి

By telugu teamFirst Published Oct 19, 2019, 1:58 PM IST
Highlights

పిల్లలతో కలిసి ఆడుకుంటున్న లాస్య.. లిఫ్ట్‌ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. తమ చిన్నారి ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించిన లాస్య తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చి ఆమెను తీసుకొని వెంటనే ఆస్పత్రికి బయల్దేరారు. కాగా... ఆస్పత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యంలో ఆ చిన్నారి మృతి చెందింది.

లిఫ్ట్ లో ఇరుక్కొని 9ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి  చిన్నారి మృత్యువాత పడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఎల్‌బీ నగర్ హస్తినాపురం పరిధిలోని పిండి పుల్లారెడ్డి కాలనీకి చెందిన చంద్రశేఖర్ కి భార్య పిల్లలు ఉన్నారు. ఆయన 9ఏళ్ల కూతురు లాస్య కు ప్రస్తుతం దసరా సెలవులు. దీంతో.. లాస్య శుక్రవారం సాయంత్రంపొరుగింటి పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది.

పిల్లలతో కలిసి ఆడుకుంటున్న లాస్య.. లిఫ్ట్‌ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. తమ చిన్నారి ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించిన లాస్య తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చి ఆమెను తీసుకొని వెంటనే ఆస్పత్రికి బయల్దేరారు. కాగా... ఆస్పత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యంలో ఆ చిన్నారి మృతి చెందింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. లిఫ్ట్‌లో పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోవడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కొందరు భవన నిర్మాణ దారులు నాసిరకం లిఫ్ట్‌లు పెట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనీ బాలల హక్కుల సంఘం ఛైర్మన్ అచ్చుత రావు ఆరోపించారు. 

అపార్మెంట్లలో నాణ్యమైన లిఫ్ట్‌లు అమర్చుకోవాలని సూచించారు. లిఫ్ట్ నాణ్యతపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి, ఆమోదించిన తర్వాతే బిగించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.
 
click me!