Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..

Published : Nov 24, 2021, 05:12 PM IST
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..

సారాంశం

హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer Ring Road) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer Ring Road) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కీసర (keesara) వద్ద రింగ్ రోడ్డుపై టోల్ ప్లాజా 8 వ నెంబర్ వద్ద  ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా మరణించారు. మృతులను సుమంత్ రెడ్డి, శంకర్ రెడ్డి, పవన్ కుమార్‌ రెడ్డిలుగా గుర్తించారు. 

వీరు ఖమ్మం (Khammam) నుంచి కారులో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. 

లోయర్ మానేరు డ్యామ్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు డ్యామ్‌లో దిగినప్పుడు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఈ యువతి suicideకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన Lower Manor Damలో పడేశారా అనేది తేలాల్చి ఉంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి వివరాలు సేకరిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?