నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Published : Jan 01, 2020, 02:44 PM IST
నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

సారాంశం

మూడు కమిషనరేట్‌ల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 

నూతన సంవత్సరం రానే వచ్చింది. ఈ సంవత్సరాన్ని స్వాగతించేందుకు ముందు రోజు రాత్రి యువత సంబరాలు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేకంగా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించారు. జిగేలుమనే దీపాల కాంతులు, డీజేల హోరులు, సెలబ్రెటీల ఆట, పాటలతో హుషారెత్తించారు.

ఆ ఆటపాటలకు జనాలు కూడా చిందులు వేశారు. చుక్కేసి కిక్కులో మునిగితేలారు. అయితే... మద్యం తాగి మాకు చిక్కితే మాత్రం వదిలపెట్టమంటూ పోలీసులు ఇప్పటికే వార్నింగ్ లు ఇచ్చారు. ఆ వార్నింగ్ లను చాలా మంది లెక్కచేయనట్లు తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో చాలా మందే దొరికారు. 

మూడు కమిషనరేట్‌ల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం సందర్భాలను పురస్కరించుకుని వివిధ వయస్సులవారు మద్యం సేవించి వాహనాలు పట్టుబడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
 
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?