కొండాపూర్ ఆసుపత్రి సూపరింటెండ్‌కు కరోనా: ఐసోలేషన్‌కి తరలింపు

By narsimha lode  |  First Published Jun 12, 2020, 6:14 PM IST

జీహెచ్ఎంసీ పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్‌కు కరోనా సోకింది. గత మూడు రోజులుగా సూపరింటెండ్ అనారోగ్యానికి గురయ్యారు.  తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా సోకినట్టుగా తేలింది.
 



హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్‌కు కరోనా సోకింది. గత మూడు రోజులుగా సూపరింటెండ్ అనారోగ్యానికి గురయ్యారు.  తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా సోకినట్టుగా తేలింది.

also read:ఉస్మానియా మెడికల్ కాలేజీ ల్యాబ్‌ డేటా ఆపరేటర్‌కి కరోనా: వ్యాపారి మృతి

Latest Videos

undefined

దీంతో అదే ఆసుపత్రిలో ఆయనను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. సూపరింటెండ్ తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారెవరనే విషయమై కూడ అధికారులు అన్వేషిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడ కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు మేయర్ డ్రైవర్ కు కరోనా సోకింది. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని శానిటేషన్ చేశారు. దీంతో ఇవాళ మరోసారి జీహెచ్ఎంసీ మేయర్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు.

గురువారం  నాటికి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 4320కి చేరుకొన్నాయి. గురువారం నాడు ఒక్క రోజులోనే కరోనా కేసులు 175 నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఉస్మానియా మెడికల్ కాలేజీలోని ల్యాబ్ లో పనిచేసే డేటా ఆపరేటర్ కు కరోనా సోకింది. దీంతో ఈ ల్యాబ్ ను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

కరోనా రోగులకు సేవలు చేస్తున్న సుమారు 45 మంది వైద్యులకు కరోనా సోకినట్టుగా గత వారంలో అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


 

click me!