హుజూర్ నగర్ బైపోల్: క్యూ కట్టిన ఓటర్లు, 53 శాతం పోలింగ్ నమోదు

Published : Oct 21, 2019, 02:36 PM IST
హుజూర్ నగర్ బైపోల్: క్యూ కట్టిన ఓటర్లు, 53 శాతం పోలింగ్ నమోదు

సారాంశం

మెుత్తం 302 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. 

హుజూర్ నగర్: హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ఒకటి రెండు చెదురుముదురు ఘటనలు మినహా మిగిలినచోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. మధ్యాహ్నాం ఒంటిగంటకు 52.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

మెుత్తం 302 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ ఉపఎన్నికలో పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటలకు 70 శాతంపైగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో మెుత్తం 28 మంది అభ్యర్థులు పోటీపడగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.  

హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మళ్లీ హుజూర్ నగర్ ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారం రోజులకు పైగా అక్కడే తిష్టవేశారు. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ సైతం హుజూర్ నగర్ ను తమ ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. హుజూర్ నగర్ పై కన్నేసిన గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలను అక్కడకు పంపారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఉప ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే నెలకొంది. ఇకపోతే ఉదయం నుంచి హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు పోలిగ్ బూత్ ల దగ్గర బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

హుజూర్ నగర్ ఉపఎన్నిక: ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

PREV
click me!

Recommended Stories

బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu