Huzurabad Bypoll: టీఆర్ఎస్ జోరు... తెల్లవారుజామునే మంత్రి గంగుల ప్రచారం షురూ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 01, 2021, 10:27 AM ISTUpdated : Oct 01, 2021, 11:28 AM IST
Huzurabad Bypoll: టీఆర్ఎస్ జోరు... తెల్లవారుజామునే మంత్రి గంగుల ప్రచారం షురూ (వీడియో)

సారాంశం

హుజురాబాద్ ఎన్నికకు షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మరింత ఊపందుకుంది. శుక్రవారం తెల్లవారుజామునే మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. 

కరీంనగర్: ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం తెల్లవారుజామునే హుజురాబాద్ కు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ హైస్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి టీఆర్ఎస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. పనిచేసే వారికి ప్రోత్సాహించాలని మంత్రి సూచించారు. 

 ఉదయం నియెజకవర్గ నేతలతో కలిసి హుజురాబాద్ ప్రజల్ని మార్నింగ్ వాక్ లో కలుసుకున్నారు గంగుల.  టౌన్ వీదుల్లో తిరుగుతూ ప్రజల్లో కలిసిపోయారు, దుకాణాలు, సెలూన్లు, చిరు వ్యాపారులు, గ్రౌండ్ల మార్నింగ్ వాకర్లతో కలిసి ముచ్చటించారు... టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతివ్వాలో వివరించారు. 

వీడియో

గతంలో ఇక్కడికి వచ్చే సమయానికి హుజారాబాద్ అస్థవ్యస్తంగా ఉందన్నారు. సరైన రోడ్లు, తాగునీరు, పారిశుద్యం, ఆరోగ్య వసతులు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించామని... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే నిధుల్ని మంజూరు చేసారని అన్నారు. మిగతా తెలంగాణకు దీటుగా హుజురాబాద్ ను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని గంగుల అన్నారు. 

read more  Huzurbad Bypoll: గెల్లుకు టీఆర్ఎస్ బీఫామ్, రూ.28లక్షల చెక్... అందజేసిన కేసీఆర్ (వీడియో)

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ చచ్చుడో-తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన సీఎం అని అన్నారు. ఇలా ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను అదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈటల రాజెందర్ నిర్లక్ష్యమే గత 20 సంవత్సరాలుగా హుజురాబాద్ వెనక్కి నెట్టేయబడిందన్నారు. కానీ ఇప్పుడు హుజురాబాద్ పట్టణాన్ని రూ.50కోట్ల నిధులతో అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి  గంగుల. 

నామినేషన్లు ఈరోజుతో ప్రారంభమవుతున్నాయని... ఇప్పటికే టీఆర్ఎస్ భీపామ్ ని ని గెల్లు శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి అందజేసారని అన్నారు. మంచిరోజు చూసుకొని గెల్లు నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్చందంగా డబ్బులు జమచేసి గెల్లు నామినేషన్ ఫీజు కడుతామన్నారని... దీంతోనే ఆయన విజయం ఖాయమైందన్నారు. 

అన్ని కులసంఘాల ఆత్మగౌరవం పెంచేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి మరింత కొనసాగించేలా మరింత ఉత్సాహం ఇచ్చేలా ప్రజలు కారుగుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ న గెలిపించాలన్నారు. కారుగుర్తుపై పోటీచేస్తున్న వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గతంలో వచ్చిన మెజార్టీకన్నా అత్యధికంగా ఓట్లు వస్తాయన్నారు గంగుల. రాబోయే రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధి భాద్యత తనదేనన్నారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే