హుజూరాబాద్ బైపోల్: బీఎస్పీ అభ్యర్ధిగా ప్రవీణ్ కుమార్?

By narsimha lodeFirst Published Aug 24, 2021, 9:44 AM IST
Highlights

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అభ్యర్ధిగా హుజూరాబాద్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనను పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.ఈ నెల 26న కరీంనగర్ జిల్లాలో కొందరు నేతలు బీఎస్పీలో చేరనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో హుజూరాబాద్ స్థానం నుండి పోటీ చేసే విషయమై ప్రకటన చేసే అవకాశం ఉంది.

కరీంనగర్:హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీ కూడ పోటీ చేసే విషయమై యోచిస్తోంది. ఆ పార్టీలో ఇటీవలనే ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  చేరారు., బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో  టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో  ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. ఈ స్థానం నుండి బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపడం ద్వారా  మెరుగైన ఓట్లను సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది.

ఈ  అసెంబ్లీ  నియోజకవర్గం నుండి దళిత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గణనీయంగా ఉంటారు. గెలుపు ఓటములపై కూడ  ప్రభావం చూపనున్నారు. ఈ నియోజ.కవర్గంలో సుమారు 40 నుండి 50 వేల వరకు దళిత సామాజికవర్గానికి చెందిన ఓటర్లుంటారు.

దీంతో ఈ స్థానం నుండి బరిలోకి దిగాలని బీఎస్పీ యోచిస్తోందని సమాచారం. ఈ స్థానం నుండి పోటీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను  పోటీ చేయాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

ఈ నెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు  చెందిన కొందరు నేతలు బీఎస్పీలో చేరనున్నారు. ఈ సభలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై  బీఎస్పీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


 

click me!