హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23 వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి Etela Rajender ఆధిక్యతను కొనసాగించారు. 8, 11 రౌండ్లలో Trs అభ్యర్ధి Gellu Srinivas Yadav తన సమీప ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పై స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే మిగిలిన అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపులో కూడా బీజేపీ అభ్యర్ధ ఈటల రాజేందర్ విజయం సాధించారు. మరో వైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఓట్లను సాధించింది. తొలి రౌండ్ నుండి ఈటల రాజేందర్ తన మెజారిటీని పెంచుకొంటూ వెళ్లారు. టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని భావించిన పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ పార్టీకి ఆశించిన ఆశించిన ఓట్లు దక్కలేదు.
also read:Huzurabad bypoll Result 2021: ముగిసిన 22వ రౌండ్, హుజూరాబాద్ ఈటలదే
undefined
హుజూరాబాద్ పట్టణం, హుజూరాబాద్ మండలంపై టీఆర్ఎస్ ఆశలు పెట్టుకొంది. కానీ ఈ ప్రాంతాల్లో కూడా బీజేపీ మెజారిటీని దక్కించుకొంది. వీణవంక మండలంలో కూడా టీఆర్ఎస్ కు ఆశించిన ఓట్లు రాలేదు. ప్రతి మండలంలో కూడా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు మెరుగైన ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈటల రాజేందర్ ను అందుకోలేకపోయారు. గెల్లు శ్రీనివాస్ తన స్వంత ఊరితో పాటు అత్తగారి ఊరిలో కూడా బీజేపీ అభ్యర్ధి ఈటటకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరో వైపు కౌశిక్ రెడ్డి స్వగ్రామంలో టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి Balmuri Venkat ఓట్లు నామమాత్రంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కౌశిక్ రెడ్డి పోటీ చేసి 60 వేలకు పైగా ఓట్లు సాధించాడు. అయితే ఈ ఎన్నికల సమయంలో ఆ పార్టీ డిపాజిట్ ను కోల్పోయింది. కనీసం నాలుగు అంకెల ఓట్లను దక్కించుకోలేదు.
రౌండ్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు
First Round (Trs) 4444, (bjp) 4610, (congress) 199...
Second Round (trs)4659, (bjp )4851,( congress ) 220
Third round trs3153, bjp,4064 congress 107
fourth round trs3882, bjp 4444, congress 234
fifth round trs 4014, bjp4358, congress137 ....
sixth round trs,3639, bjp4656, congress 180 1017
seventh round trs3792, bjp4038, congress 94
eight round trs4248, bjp 4086 , congress
ninth round trs3470 , bjp5305, congress 1349
10th round trs3709, bjp 4295, congress 118
11 th round trs4326, bjp3941, congress 104
12 th round trs3632, bjp4849, congress 158
13 th round trs2971, bjp4836, congress 101
14th round trs 3700,bjp 4746,congress 152
15 th round trs 3358 bjp 5407, congress 149
16th round trs3917, bjp5689 congress135
17 th round trs 4187, bjp 5610, congress 203
18th round trs3735 , bjp5611, congress94
19 round trs2859, bjp5916, congress97
20 round trs3795 bjp5269 congress107
21 round trs3431 , bjp 5151, congress 136
22 round trs 3351, bjp4481 , congress