Huzurabad Bypoll: పెరిగిన ఓటింగ్ శాతం.. హుజురాబాద్‌లో గెలుపెవరిది..?

By Siva Kodati  |  First Published Oct 30, 2021, 7:57 PM IST

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ (huzurabad byPoll) ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ (polling) నమోదవుతోంది. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ (huzurabad byPoll) ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ (polling) నమోదవుతోంది. ఉదయం నుంచి గమనించినట్లయితే ప్రతీ రెండు గంటలకు 7.60 శాతం ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. సాయంత్రం ఏడు గంటల వరకు బూత్ లోపల క్యూలైన్లలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం (election commission) . 

దీంతో ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. టీఆర్ఎస్ వ్యతిరేక ట్రెండ్ వల్లే ఓటింగ్ పెరిగిందని బీజేపీ (bjp) నేతలు చెబుతుండగా, ఈటలను ఓడించడానికే జనం పెద్ద ఎత్తున ఓట్లేస్తున్నారని గులాబీ నేతలు (trs) అంటున్నారు. దీంతో ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎవరిది విజయమనేది ఈనెల 2న తేలిపోనుంది. 

Latest Videos

undefined

ALso Read:Huzurabad bypoll: ఈటల రాజేందర్ వాహనం సీజ్.. ఆయన పీఆర్పోను అదుపులోకి తీసుకన్న పోలీసులు..

పోలింగ్ వేళ ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను బెదిరిస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ కాసేపటికే ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేయడం సంచలనం రేపింది. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో చాలా చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అలాగే జమ్మికుంటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పీఏలో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ వారిని స్థానికులు చితకబాదారు. 

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 
 

click me!