Huzurabad Bypoll:మేమంతా కేసీఆర్ బొమ్మతోనే గెలిచాం... గెల్లును గెలిపిస్తాం: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Oct 1, 2021, 4:51 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.    

కరీంనగర్:  హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇల్లందకుంట రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. ఆయన హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ...  2001 నుండి ఉద్యమనాయకుడు కేసీఆర్ కి అండగా నిలిచిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నిబద్దత, క్రమశిక్షణతో పనిచేశారని... పదవిలో ఉన్నా, లేకున్నా ఉద్యమం చేసిన నిజమైన ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ అన్నాకు. అందుకే సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో ఫోటీకి గెల్లును బలపర్చి టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు మంత్రి గంగుల. 

నిన్న సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ తీసుకున్న గెల్లు శ్రీనివాస్ మంచిరోజైన ఇవాళ(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేసారని తెలిపారు. కేసీఆర్ బొమ్మ మీదే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని... తాము సైతం అలాగే గెలిచామని.... రేపు హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైతం అలాగే గెలుస్తారని అన్నారు. కేసీఆర్ బొమ్మపైనే గెల్లు శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారని గంగుల ధీమా వ్యక్తం చేశారు. 

''ఈరోజు ఓట్ల కోసం వస్తున్న ఈటెలకు ఐదు సంవత్సరాల కాలానికి హుజురాబాద్ లో అవకాశం ఇచ్చారు. కానీ ఆయన అవకాశవాదం, వ్యక్తిగత ఎజెండాతో మద్యలోనే కత్తి వదిలేసి పోరాటాన్ని ఆపేశారు. గెల్లు శ్రీనివాస్ అలాకాకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తారు'' అన్నారు. 

read more  huzurabad bypoll: నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

''గతంలో హుజురాబాద్ నియెజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోట... ప్రస్తుతం ఉపఎన్నికలో 2018 కంటే అత్యధిక మెజార్టీని సాధిస్తాం. కేసీఆర్ పై ప్రేమ ఉన్నప్పటికీ ఈటలపై వ్యతిరేకతతో గతంలో కోల్పోయిన ఓట్లు సైతం ఈ సారి సాధిస్తాం. అభివృద్ధి మనందరికీ ముఖ్యం కావాలి.... ఈటల నిర్లక్ష్యంతో హుజురాబాద్ కోల్పోయిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టాలంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఓటేయాలి'' అని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ... హుజురాబాద్ లో పోటీచేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలయజేసారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బిడ్డగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. హుజురాబాద్ అభివృద్ధికోసం అహర్నిశలు అందుభాటులో ఉండి కష్టపడతానని... ప్రజలంతా కులమతాల కతీతంగా ఓటేయాలని అభ్యర్థించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దుతు తెలయజేయాలని... ప్రతీ ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలని గెల్లు శ్రీనివాస్ కోరారు. 


 


 

click me!