Huzurabad Bypoll: టీఆర్ఎస్ గూటికి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ ఛైర్మన్

By Arun Kumar PFirst Published Sep 3, 2021, 2:54 PM IST
Highlights

హుజురాబాద్ నియోజవకవర్గంలో జరగనున్న ఉపఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆయన అక్కడే మకాం వేసి టీఆర్ఎస్ లోకి వలసలను ఆహ్వానిస్తున్నారు. 

హుజురాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లోనే మకాం వేసి స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ చైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. స్వయంగా హరీష్ రావు లక్ష్మణ్ కు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మత్స్యకారులకు అండగా నిలవలేవన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు సీఎం జగన్ అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు.  ముఖ్యంగా ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం ద్వారా చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు.  2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో చేపట ఉత్పత్తి 3.49లక్షల టన్నులకు చేరిందని మంత్రి వెల్లడించారు. 

read more  ఈటల సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే ఆలోచన హరీష్ రావుదే

తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయిన చేపల్లో 60శాతం స్థానిక అవసరాలకు ఉపయోగించుకుంటుండగా మిగతా 40శాతం పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఇలా మత్స్యకారులకు అధిక లాభాలు వచ్చేలా చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి హరీష్ పేర్కొన్నారు. 

click me!