తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలు

Published : Sep 03, 2021, 01:08 PM ISTUpdated : Sep 03, 2021, 01:15 PM IST
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక: రానున్న మూడు నాలుగు రోజుల్లో  భారీ వర్షాలు

సారాంశం

రానున్న మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు  చెప్పారు.

 ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాడు రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ లో ఏడు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది. వర్షం వస్తే చాలు నగరవాసులు భయపడుతున్నారు. నగరంలో వర్షం నీరు సక్రమంగా వెళ్లే మార్గం లేక  ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?
Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది