Huzurabad Exit Polls: హుజురాబాద్ ఎగ్జిట్ పోల్స్.. ఈటల కంచుకోటను కాపాడుకున్నట్టేనా..?

By team teluguFirst Published Oct 30, 2021, 8:16 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల భారీగా బెట్టింగ్‌లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగినట్టుగా తెలుస్తోంది. 

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుున్నారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో వున్న వారికి కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ సారి హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు హుజురాబాద్‌లో 86.33 శాతం పోలింగ్ నమైదైంది. అయితే  2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల భారీగా బెట్టింగ్‌లు కూడా కొనసాగుతున్నాయి. 

అయితే ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అర్థమవుతంది. అయితే మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్ హుజురాబాద్‌లో బీజేపీకే ఎక్కువ శాతం ఓట్లు పోల్ అయినట్టుగా చెప్తున్నాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ఆధారంగా వెలువడినవే. అయితే 7 గంటలకు వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో చివరి అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎవరెన్ని అంచనాలు వేసిన.. నవంబర్ 2 జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతే విజేత ఎవరనేది తెలనుంది.

Also read: Huzurabad Bypoll: పెరిగిన ఓటింగ్ శాతం.. హుజురాబాద్‌లో గెలుపెవరిది..?

మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వైపే హుజురాబాద్ ఓటర్లు మొగ్గు చూపారు. ప్రతి మండలంలోనూ బీజేపీ పూర్తి అధిపత్యం కనబరించిందని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 

మిషన్ చాణక్య
బీజేపీ-59.20 శాతం
టీఆర్ఎస్-39.26 శాతం
కాంగ్రెస్- 0.69 శాతం

పొలిటికల్ లాబోరేటరి
బీజేపీ-51 శాతం
టీఆర్ఎస్- 42 శాతం
కాంగ్రెస్- 2-3 శాతం

హెచ్‌ఎంఆర్ రీసెర్చ్
బీజేపీ- 51.16 శాతం (7.18% + / 5.18% -)
టీఆర్‌ఎస్- 44.98 శాతం
కాంగ్రెస్- 2.81 శాతం

పబ్లిక్ పల్స్
టీఆర్‌ఎస్-44.3 శాతం
బీజేపీ- 50.9 శాతం
కాంగ్రెస్- 2.7 శాతం

ఆత్మసాక్షి
బీజేపీ-50.5 శాతం
టీఆర్‌ఎస్-43.1 శాతం
కాంగ్రెస్ -5.7 శాతం


హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహించారు. ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు. మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు. 306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.

ALso Read:Huzurabad bypoll: ఈటల రాజేందర్ వాహనం సీజ్.. ఆయన పీఆర్పోను అదుపులోకి తీసుకన్న పోలీసులు..

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే పోరు సాగినట్టుగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది. 

click me!