హుజురాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవిఎంలను తరలింపు సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కరీంనగర్: హుజురాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా పోలయిన ఓట్లతో కూడిన బాక్స్ లను మాయం చేయడం దుర్మార్గమన్నారు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్. పోలింగ్ ముగిసిన తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్న బస్సుల్లో కూడీ ఈవిఎంలు మార్చినట్టు వార్తలు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. సాంకేతిక కారణాల సాకుతో ఈవీఎం లను మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
''నన్ను ఓడించడానికి సీఎం KCR అన్ని ప్రయత్నాలు చేశారు. డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ లు, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసిన కూడా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారు'' అని eatala rajender ఆరోపించారు.
undefined
''ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదు. TRS ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారు. వీటన్నింటిపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నాం'' అని తెలిపారు.
వీడియో
''అధికార టీఆర్ఎస్ అక్రమాలపై ఎన్నిసార్లు కలెక్టర్, పోలీస్ కమీషనర్ కు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. వారు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇప్పుడు కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయి నిర్లక్ష్యమా?'' అని ప్రశ్నించారు.
Video Huzurabad Bypoll: అర్ధరాత్రి హైడ్రామా... కారులో పట్టుబడ్డ ఈవీఎం మిషన్లు
'Huzurabad ప్రజల ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఇది మామూలు ఎన్నిక కాదు... చారిత్రాత్మక ఘట్టమిది. హుజురాబాద్ ప్రజలు ఆందోళన చెందొద్దు... ఎన్ని అక్రమాలకు పాల్పడినా అంతిమవిజయం ధర్మం, న్యాయానిదే'' అని ఈటల ధీమా వ్యక్తం చేసారు.
ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్ పోలీసుల సహకారంతో అర్ధరాత్రి ఈవిఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలు, వివి ప్యాట్ లను తరలించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు.
read more టీఆర్ఎస్ కోట్లు ఖర్చుచేసింది.. హుజురాబాద్ ఫలితంతో తెలంగాణలో పెనుమార్పులు: ఈటల వ్యాఖ్యలు
సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని... పనిచేయని వివి ప్యాట్ ను అఫీషియల్ వాహనం నుండి మరొక అఫీషియల్ వాహనములోకి మార్చి తరలించామన్నారు. హుజరాబాద్ పోలింగ్ లో ఈ వివి ప్యాట్ వాడలేమని.... పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ వివి ప్యాట్ పనిచేయకపోవడంతో పక్కనపెట్టామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ వివి ప్యాట్ ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా గల రోడ్డుపై ఓ అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలోకి మార్చి గోదాంకు తరలించామన్నారు.
అయితే వివి ప్యాట్ ను మరో వాహనంలోకి మార్చి తరలిస్తుండగా అనుమానంతో ఎవరో వీడియో తీసినట్లున్నారు. అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని హుజురాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సూచించారు.