టీఆర్ఎస్ (trs) ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్ (huzurbad bypoll) బీజేపీ (bjp) అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ (trs) ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్ (huzurbad bypoll) బీజేపీ (bjp) అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఉప ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అబద్ధాలు చెప్పి గెలవొచ్చని కేసీఆర్ (kcr) ప్రయత్నించారని ఈటల ఆరోపించారు. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని రాజేందర్ అన్నారు. కేసీఆర్ కుట్రను హుజూరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని ఆయన తెలిపారు.
ALso Read:Huzurabad Exit Polls: హుజురాబాద్ ఎగ్జిట్ పోల్స్.. ఈటల కంచుకోటను కాపాడుకున్నట్టేనా..?
undefined
హుజూరాబాద్ మొదటి నుంచి చైతన్యవంతమైన గడ్డ అని.. అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదని రాజేందర్ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ (bandi sanjay) , అర్వింద్ (dharmapuri arvind), విజయశాంతి (vijayashanti), డీకే అరుణ (dk aruna), కేంద్రమంత్రులు, జాతీయ నేతలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక కోసం కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. రేపు వచ్చే విజయం హుజూరాబాద్ ప్రజలకే కాదు మొత్తం తెలంగాణకు అంకితం చేస్తానన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ లో పెను మార్పులు రాబోతున్నాయని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
మరోవైపు పోలింగ్ వేళ ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను బెదిరిస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ కాసేపటికే ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేయడం సంచలనం రేపింది. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో చాలా చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అలాగే జమ్మికుంటలో (jammikunta) ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (aroori ramesh) పీఏలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ వారిని స్థానికులు చితకబాదారు.
కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు.