హుజూరాబాద్ లో పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకొంది. ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడుగంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కరీంనగర్: Huzurabad bypoll ను పురస్కరించుకొని పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ సమయాన్ని రెండు గంటలు అదనంగా పెంచారు. దీంతో ఈ దఫా భారీగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అసైన్డ్, దేవాలయ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో Etela Rajender ను మంత్రివర్గం నుండి Kcr భర్తరఫ్ చేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే అంటే జూన్ 14న ఈటల రాజేందర్ Bjpలో చేరారు. రాజేందర్ రాజీనామాతో ఈ నెల 30న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
also ead:Huzurabad Bypoll: అన్నీ ఇలాగే కొనసాగాలంటే... గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి: మంత్రి తలసాని
undefined
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 305 పోలింగ్ స్టేషన్లున్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చే వికలాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో corona నిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జరుగుతోంది. Voters భౌతికదూరం,Mask, శానిటైజర్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈసారి పోలింగ్ సమయాన్ని రెండు గంటలు అదనంగా కేటాయించారు. సాయంత్రం ఏడు గంటల లోపుగా ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరితే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.రెండు గంటలు అదనంగా సమయం కేటాయించడంతో ఇతరరాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడ రప్పించి ఓటు హక్కును వినియోగించుకొనేలా పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లందరికీ అధికారులు ఓటింగ్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు.ఈ ప్రక్రియ తుది దశకు చేరుకొంది. పోలింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానం నుండి 2009 నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్న ఈటల రాజేందర్ ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.నాలుగు మాసాల నుండి బీజేపీ, టీఆర్ఎస్‌లు ఈ ఉప ఎన్నిక ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అభ్యర్ధిని ప్రకటించింది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.