రేవంత్‌ చుట్టూ ఉచ్చు: ఏసీబీలోకి సమర్ధులైన అధికారులు.. ఓటుకు నోటు కేసు ఇక పరుగులే

By Siva KodatiFirst Published Oct 26, 2021, 3:09 PM IST
Highlights

టీపీసీసీ (tpcc ) చీఫ్ రేవంత్ రెడ్డిని (revanth reddy) ఓటు నోటు కేసు (vote for note) వెంటాడుతోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సమర్థులైన అధికారులను ఎంపిక చేసి ఇకపై ఈ కేసు పర్యవేక్షణ, దర్యాప్తు బాధ్యత వారికే అప్పగించింది.

టీపీసీసీ (tpcc ) చీఫ్ రేవంత్ రెడ్డిని (revanth reddy) ఓటు నోటు కేసు (vote for note) వెంటాడుతోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సమర్థులైన అధికారులను ఎంపిక చేసి ఇకపై ఈ కేసు పర్యవేక్షణ, దర్యాప్తు బాధ్యత వారికే అప్పగించింది. ప్రభుత్వ నిర్ణయంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి (anti corruption bureau) బదిలీ చేయనున్నారు. ఓటుకు నోటు కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

2015లో తొలుత ఈ కేసు నమోదైనప్పుడు ఏసీబీతో కలిసి పనిచేసిన దర్యాప్తు అధికారి, ఇతర అధికారులు సేకరించిన వివరాలతో కలిపి రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పలువురు అధికారులను కాలక్రమంలో సిటీ పోలీస్‌ శాఖలోని ఇతర విభాగాలకు బదిలీ చేశారు. కొద్దిరోజుల క్రితం ఓటుకు నోటు కేసు, చట్టపరమైన చర్యలతో పాటు ఏసీబీ కేసులపై ఉన్నతాధికారులు సమీక్షా  సమావేశం  నిర్వహించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వీడియో ఫుటేజీ వాస్తవాని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రుజువైనందున.. సాధారణ చట్టపరమైన చర్యల స్ధితిగతులను సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని అధికారులు సమీక్షా సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

ALso Read:ఓటుకు నోటు కేసులో రేవంత్ కాల్ డేటా... ఏసిబి కోర్టుకు బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి బాల్ సింగ్

సీఐడీ అదనపు డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి గోవింద్ సింగ్ (govind singh) ఏసీబీ చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో న్యాయస్థానంలో విచారణను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రెవెన్యూ (revenue department) విభాగంలో అవినీతిని నియంత్రించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏసీబీ  డైరెక్టర్ జనరల్‌గా త్వరలోనే ప్రభుత్వం నియమించే అవకాశం వుంది. 2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (telugu desam party) అభ్యర్ధికి మద్ధతివ్వాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు (stephenson) ముడుపులు (bribe) ఇచ్చిన కేసులు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తదితరులపై ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 

click me!