Huzurabad Bypoll: అన్నీ ఇలాగే కొనసాగాలంటే... గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి: మంత్రి తలసాని

Arun Kumar P   | Asianet News
Published : Oct 26, 2021, 03:01 PM ISTUpdated : Oct 26, 2021, 03:06 PM IST
Huzurabad Bypoll: అన్నీ ఇలాగే కొనసాగాలంటే... గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి: మంత్రి తలసాని

సారాంశం

హుజురాబాద్ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను రంగంలోకి దింపింది. ఇప్పటికే పలుమార్లు హుజురాబాద్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. 

huzurabad నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి గ్రామాలలో మంత్రి talasani srinivas yadav, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... రాష్ట్రంలో TRS అధికారంలో ఉన్నందున gellu srinivas yadav ను గెలిపిస్తే ప్రభుత్వం హుజురాబాద్ పరిధిలోని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. 

''స్వాతంత్య్రం తర్వాత 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి'' అని తలసాని తెలిపారు. 

''కులవృత్తులకు చేయూత అందించిన ప్రభుత్వం TRS. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి KCR కే దక్కుతుంది'' అన్నారు.

read more  Huzurabad Bypoll: నాకే కాదు కేసీఆర్ కూ అన్నం పెట్టిన ఊరిది..: హరీష్ భావోద్వేగం (వీడియో)

''BJP నేతలు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు మానాలి. నిజంగానే ఆ పార్టీ నాయకులకు ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే బలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి'' అని మంత్రి తలసాని ఓటర్లను కోరారు. 

ఈ నెల 30వ తేదీన హుజురాబాద్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటలు ముందుగానే ప్రచారానికి తెరపడనుంది. దీంతో బుధవారం సాయంత్రం వరకే ప్రచారానికి సమయం వుండటంతో హుజురాబాద్ అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. వచ్చే నెల నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది.

అక్టోబర్ 1వ తేదీన హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల  స్వీకరణ, అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. ఇక అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు gellu srinivas yadav, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు balmoor venkat (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. 
  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?