చిన్నోడినే కావచ్చు చిచ్చరపిడుగును: కేసీఆర్ కు ఈటల రాజేందర్ కౌంటర్

Published : Jul 27, 2021, 07:46 AM IST
చిన్నోడినే కావచ్చు చిచ్చరపిడుగును: కేసీఆర్ కు ఈటల రాజేందర్ కౌంటర్

సారాంశం

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తాను చిన్నోడినే కావచ్చు గానీ చిచ్చరపిడుగునని ఆయన అన్నారు. 

హుజూరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ శాసనశభ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్తకు ఇటీవల కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడుతూ... ఈటల రాజేందర్ చాలా చిన్నోడని, పట్టించుకోవద్దని అన్నారు. దానికి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

తాను చిన్నోన్నే కావచ్చు కానీ చిచ్చరపిడగునని, తాను గెలిచిన తర్వాత విప్లవం వస్తుందని ఆయన అన్నారు. తప్పు చేస్తే తనను జైలులో పెట్టాలని ఆయన సవాల్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రజాదీవెన కార్యక్రమం పాదయాత్ర సభల్లో ఆయన ప్రసంగించారు. 

కేసీఆర్ కు నీతి, జాతి, మానవత్వం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ మనిషే కాదని దుయ్యబట్టారు. ఒక్కసారి తింటేనే మరిచోబమని, అలాంటిది తాను 18 ఏళ్లు కేసీఆర్ తనతో 18 ఏళ్లు పనిచేయించుకుని చివరకు భూకబ్జాదారుడినని బయటకు పంపించారని ఆయన అన్నారు. 

16 ఏళ్ల క్రితం ఒకాయన నక్సలైట్ కు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చానని కేసు పెట్టాడని, ఇప్పుడు ఆ కేసును బయటకు తీసి జైలులో పెడుతామని 3 రోజుల నుంచి డిఎస్పీ స్థాయి అధికారి తన వెంట పడుతున్నారని, ఇలాంటివాటికి తన అభిమానులు భయపడబోరని ఈటల రాజేందర్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!