అనుమానంతోనే హత్య: కరీంనగర్ నవ వధువు హత్యలో ట్విస్ట్ ఇదీ...

Published : Jul 26, 2021, 07:56 PM IST
అనుమానంతోనే హత్య: కరీంనగర్ నవ వధువు హత్యలో ట్విస్ట్ ఇదీ...

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం బొమ్మన్‌పల్లికి చెందిన అనిల్ తన భార్య ప్రవళికను హత్యచేశాడు.  ఈ హత్య కేసును పోలీసులు 30 గంటల్లోనే చేధించారు అనుమానంతోనే భార్యను అనిల్ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు.

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నవవధువు హత్య కేసును పోలీసులు 30 గంటల్లో చేధించారు. కట్టుకొన్న భర్తే భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడని పోలీసులు చెప్పారు. అనుమానంతోనే భార్యను హత్య చేశాడని నిందితుడు ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.చిగురుమామిడి మండలం బొమ్మన పల్లి కి చెందిన నవ వధువు ప్రవళిక హత్యకు గురైంది.  తన కన్నా ఎక్కువ చదువుకొన్న భార్య రోజూ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడడంపై  భర్త అనిల్ ఆమెపై అనుమానం పెంచుకొన్నాడు.  ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేసుకొన్నాడు. తాను భార్యను హత్య చేసినా కూడ ఆ విషయం బయటకు రాకుండా ప్లాన్ చేశాడు.  

మధ్యాహ్నం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి భార్య గొంతు కోసి హత్య చేశాడు అనిల్. భార్యను హత్య చేసేముందు టీవీ సౌండ్ ను పెంచాడు. దోపీడీ దొంగలు ఆమెను హత్య చేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయమై పోలీసులు స్థానికంగా ఉన్న సీసీకెమెరా దృశ్యాలను పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. తన స్నేహితుడి బైక్ పై అనిల్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి భార్యను హత్య చేసి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌