Huzurabad Bypoll: ఎన్నిక తర్వాత ఈటల, హరీష్ ఒక్కటవుతారు... ఇద్దరూ దొంగలే: జీవన్ రెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Oct 26, 2021, 4:15 PM IST
Highlights

హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న మంత్రి హరీష్, మాజీ మంత్రి ఈటల మళ్లీ ఒక్కటవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 

కరీంనగర్: ఈటల రాజేందర్ బిజెపిలో చేరి విలువలు కోల్పోయాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మండిపడ్డారు. ఆయన లెఫ్ట్ సిద్ధాంతం ఎటు పోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎన్నికల తర్వాత ఒక్కటవుతారని పేర్కొన్నారు. ఇద్దరూ దొంగలేనని జీవన్  రెడ్డి విమర్శించారు. 

హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మేల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పురుషోత్తం రావుతో కలిసి jeevan reddy మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండాలనే huzurabad bypoll లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 

''కేంద్ర పర్యవేక్షణలో ఉన్న ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే కేంద్ర మంత్రులు కూడా ఏం మాట్లాడడం లేదు. మతపరమైన బిల్లులు త్రిబుల్ తలాక్ తో పాటు,పెద్దనోట్ల రద్దు , జీఎస్టీ వంటివాటిని కేంద్రం తీసుకువస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది. వీటన్నింటిని చూస్తే BJP కి తోక పార్టీ TRS అని అర్థమవుతుందన్నారు. బిజెపి ఎలా చెబితే టీఆర్ఎస్ అలా తోకాడిస్తుంది'' అని కాంంగ్రెస్ ఎమ్మెల్సీ ఆరోపించారు. 

read more  తండ్రి కుర్చీకే ఎసరు పెడుతున్న కేటీఆర్.. భవిష్యత్తులో ఏపీలో లోకేష్ కూడా.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

''గతంలో congress party నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వల్లే హుజూరాబాద్ పచ్చగా మారింది. ఇలా మీ ప్రాంతానికి మేలుచేసిన కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉండాలని... చేయి గుర్తుకు ఓటేసి balmoor venkat  ను గెలిపించాలని కోరుతున్నా'' అన్నారు. 

''ముఖ్యమంత్రి kcr వరి వేసుకుంటే ఉరి అంటుంటే... మంత్రి harish rao అందుకు మద్దతు పలుకుతుండు. రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మితే సీజ్ చేస్తాం అని కలెక్టర్లు అంటున్నారు... అసలు ఆ అధికారం కలెక్టర్లకు ఎవరిచ్చారు'' అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు... దీంతో చాలామందికి పెళ్ళిళ్ళు కావడం లేదు. హుజూరాబాద్ ప్రజలకు టీఆరెఎస్, బిజెపి లకు బుద్ది చెప్పే అవకాశం వచ్చింది.కాంగ్రెస్ ను గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పండి'' అని సూచించారు.

''2014 లో వాగ్దానం చేసిన కరీంనగర్ ల మెడికల్ కాలేజీకే దిక్కులేదు... ఇప్పుడు హుజూరాబాద్ లో medical college పెడతామని అంటున్నారు. వీరి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు'' అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 
 
 

click me!