ఇద్దరు పిల్లల తల్లి.. భర్త వద్దు రాందాస్ తోనే ఉంటానంటూ పీఎస్ కు.. చివరికి...

By AN TeluguFirst Published Nov 13, 2021, 1:09 PM IST
Highlights

లక్ష్మి భర్త చందర్ కత్తితో రాందాస్ మీద దాడి చేసి తల, ఛాతి, కడపు మీద మూడు Stabs పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కామారెడ్డి : వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె ప్రియుడి ప్రాణాల మీదికి తెచ్చింది. భర్త దాడి చేయగా ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పిట్లం మండలంలోని నాగంపల్లి తండాకు చెందిన చందర్ కు, కాస్లాబాద్ తండాకు చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం marriage జరిగింది. చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలీ పని చేస్తూ నివసిస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి, తలాబ్ తండాకు చెందిన రాందాస్ అనే యువకుడి ప్రేమించుకుంటున్నారు. 

ఈ క్రమంలో శుక్రవారం Ramdas నాగంపల్లి తండాలోని లక్ష్మిని కలవడానికి వెళ్లగా భర్త చందర్, కుటుంబసభ్యులు అతడిని బెదిరించి పంపించివేశారు. వెంటనే లక్మి, తన పిల్లలతో కలిసి పిట్లం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తతో ఉండనని, రాందాస్ తోనే ఉంటానని తెలిపింది. 

రాందాస్, లక్ష్మి స్టేషన్ లోనే ఉండగా, సాయంత్రం రాందాస్ కానిస్టేబుల్ ను వెంటతీసుకుని ఓ Fast food centerకు వెళ్లాడు. అక్కడ లక్ష్మి భర్త చందర్ కత్తితో రాందాస్ మీద దాడి చేసి తల, ఛాతి, కడపు మీద మూడు Stabs పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుడు రాందాస్ ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. 

YS Sharmila deeksha: ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభం

ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది. త్వరలో వివాహం కావలసిన యువతికి పని చూపిస్తామని తీసుకెళ్లి మద్యం తాగించి, అత్యాచారం చేశారు. మహబూబ్ నగర్ టౌన్ సిఐ రాజేశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోయిలకొండ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అలియాస్ రాజు (35), మహబూబ్ నగర్ మండలం  కోటకదిర గ్రామానికి చెందిన ఆంజనేయులు (27) పెయింటర్లుగా పనిచేస్తున్నారు. 

ఇద్దరు వివాహితులే. రోజు జిల్లా కేంద్రంలోని TD gutta ప్రాంతానికి వచ్చి నిలబడి పని దొరికిన చోటుకు వెళుతుంటారు. ఈ నెల 5న అదే అడ్డాలో ఓ యువతి (21)ని పని ఇస్తామని తనవెంట రమ్మని బలవంతపెట్టారు. పట్టణ శివారులో  పని ఉందని, కూలీ డబ్బులు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి వారి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని... ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

అక్కడ యువతికి liquor తాగించి, rapeకి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను తమ cellphoneలో బంధించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయ పెట్టారు. ఈనెల 18న ఆమెను వివాహం కావాల్సి ఉండడంతో.. దాన్ని చెడగొట్టాలని భావించి ఫోన్ లో తీసిన చిత్రాలను ఈ నెల 10న యువతి కాబోయే భర్తకు వాట్స్అప్ ద్వారా పంపించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

షాక్ అయిన యువతి family members అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  శుక్రవారం టీడీగుట్ట అడ్డాలో ఉన్న యువకులను అరెస్టు చేశారు.

click me!