రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భార్యను విద్యుత్ షాక్ పెట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోద ు చేసి దర్యాప్తు చేశారు.
షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బుధవారంనాడు దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న భార్యకు విద్యుత్ షాక్ పెట్టి హత్య చేశాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పదేళ్ల క్రితం కవిత, యాదయ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే యాదయ్య మద్యానికి బానిసగా మారాడు. దీంతో మద్యం తాగవద్దని కవిత నిన్న రాత్రి భర్త యాదయ్యను కోరింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్య కవిత నిద్రపోయిన విషయాన్ని గుర్తించిన భర్త యాదయ్య భార్య కవితకు విద్యుత్ షాక్ పెట్టి చంపాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న చిన్న కారణాలతో భార్యలను హత్య చేస్తున్న ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.హైద్రాబాద్ కూకట్ పల్లిలో మద్యం మత్తులో సోమవారంనాడు హత్య చేశాడు భర్త, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఫ్లైఓవర్ కింద రాత్రిపూట నిద్రపోతుంటారు భార్యాభర్తలు. అయితే మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు నిందితుడు.
హైద్రాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఎర్ర జనార్ధన్, తన భార్య ప్రేమలతను హత్య చేశాడు. ఆ తర్వాత జనార్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ముందు రోజు ఫంక్షన్ కు వెళ్లారు. ఫంక్షన్ లో జనార్ధన్ పీకల వరకు మద్యం సేవించాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రేమలతతో గొడవకు దిగాడు. కోపంతో భార్య ప్రేమలతపై రాడ్ తో కొట్టి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.