భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

Published : Apr 04, 2019, 02:50 PM IST
భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

సారాంశం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ దేశాయిపేట ఎంహెచ్ నగర్‌కు సునీత, లంక రాములు 11 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం నాడు భార్య భర్తలు గొడవ పెట్టుకొన్నారు. 

ఈ సమయంలో ఆవేశానికి లోనైన రాములు భార్య సునీతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఆ తర్వాత  అతను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.   ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!