ఆ యాప్ తో ఆమె ఫోన్ ను ట్రేస్ చేయడం మొదలు పెట్టాడు. దీంతోపాటు ఆమె ఫోన్ ను కూడా భర్తే ఆపరేట్ చేసేవాడు. వీటితో పాటు ఆమె వాట్సాప్ చాటింగులు చూడటం, ఆడియో రికార్డింగు వినడం వంటివి చేస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఫోన్ ను అతడు అనుసందానం చేసి వాటితో వీడియో షూటింగ్ కూడా చేసేవాడు.
సీక్రెట్ యాప్ ను రహస్యంగా తన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అనుమానంతో వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ రాజు వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన టి. నర్సింహాచలం 48) తన భార్య అనిత ఫోన్ లో ఓ సీక్రెట్ యాప్ ను ఇన్ స్టాల్ చేశాడు.
ఆ యాప్ తో ఆమె ఫోన్ ను ట్రేస్ చేయడం మొదలు పెట్టాడు. దీంతోపాటు ఆమె ఫోన్ ను కూడా భర్తే ఆపరేట్ చేసేవాడు. వీటితో పాటు ఆమె వాట్సాప్ చాటింగులు చూడటం, ఆడియో రికార్డింగు వినడం వంటివి చేస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఫోన్ ను అతడు అనుసందానం చేసి వాటితో వీడియో షూటింగ్ కూడా చేసేవాడు. ఈ విషయం భార్య ఆలస్యంగా గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించింది.
undefined
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా భర్త నర్సింహాచలం భార్య ఫోన్ లో చేసిన నిర్వాకాన్ని అంగీకరించాడు. కొన్నేళ్ల కిందట ఇంట్లో నుంచి పోయిన బంగారం విషయంలో ఆరా తీయడానికి ఈ సీక్రెట్ యాప్ ఇన్ స్టాట్ చేసినట్లు నిందితుడు చెప్పాడని సీఐ తెలిపారు.
ఇదే రీతిలో మరో ఇద్దరు బంధువుల ఫోన్లలో సీక్రెట్ యాప్ ను ఎందుకు ఇన్ స్టాల్ చేశాడన్న విషయంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహాచలం మీద 498,435 సి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.