ఘరానా దొంగ.. వయసు 46, చోరీలు 55..చివరికి..

By AN TeluguFirst Published Jun 30, 2021, 9:51 AM IST
Highlights

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హుమాయున్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 55 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హుమాయున్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 55 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 

అతని నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, బైక్, ఛోరీలకు వినియోగించే ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, టార్చ్ లైట్, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. 

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. హుమాయున్ నగర్ కు చెందిన షాజహాన్ బేగం (46) కుమారుడి పెళ్లికి సంబంధించిన పత్రికలు పంచడానికి ఈ నెల 23 సాయంత్రం 5.30 కు బయలుదేరారు. తిరిగి రాత్రి 9.30కి ఇంటికి చేరుకోగా మెయిన్ డోర్ తాళం పగలగొట్టి ఉంది. ః

అల్మారా తెరిచి ఉంది. కొడుకుపెళ్లికి సంబంధించిన రూ. లక్ష నగదు, 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు సామగ్రి చోరీ అయినట్లు రాత్రి 10 గంటలకు ఆమె హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గోల్కొండ నివాసి మహమ్మద్ ఇబ్రహీం(44) పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇబ్రహీం జల్సాల నిమిత్తం డబ్బు సంపాదనకు చోరీల బాట పట్టాడు. 

చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఓ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 53 చోరీలు చేశాడు. 50 కేసుల్లో రిమాండ్ కు వెళ్లాడు. కొన్ని కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. రెండు సార్లు అతనిపై పీడీయాక్టు కూడా నమోదైనా తీరు మారలేదు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో జైలు నుంచి విడుదలైన ఇబ్రహీం.. తాజాగా హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు చేశాడు. వీటితో అతని మీద మొత్తం 55 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ సునీల్, డీఐ నారాయణ రెడ్డి తో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు. 

click me!