వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం.. రెస్టారెంట్‌ లో ఎగిసిపడుతున్న మంటలు

By SumaBala Bukka  |  First Published May 27, 2022, 8:53 AM IST

వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. 


వరంగల్ : Warangal జిల్లా కేంద్రంలో ఘోర Fire Accident చోటు చేసుకుంది. చౌరస్తాలోని మను ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో Restaurant పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు సమాచారం. వివరాల ప్రకారం Short circuit కారణంగా మంటలు వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ ముందు క్లాత్ తో చేసిన డెకరేషన్ కు మొదట మంటలు అంటుకోవడంతో క్లాత్ బోర్డ్ ఉండటం కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిపడ్డాయి. ఈ మంటల్లో రెస్టారెంట్ లోని ఫర్నీచర్, సీలింగ్ దగ్థమయ్యింది. 

సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సీ మొబైల్ షాప్ లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 

Latest Videos

undefined

కాగా, గురువారం హైదరాబాద్ లో ఇలాంటి అగ్నిప్రమాదమే సంభవించింది. హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  నిత్యం రద్దీగా ఉండే లాడ్ బజార్ లోని ఓ రెండస్తుల భవనంలో మంటలు చెలరేగి ఓ బట్టల దుకాణం పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 

వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం చారిత్రకప్రాధాన్యత కలిగి ఉండడంతో.. పర్యాటకుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది. ఇక చార్మినార్ పక్కనుండే లాడ్ బజార్.. ఇరుకు గల్లీలు.. చిన్న చిన్న షాపులు.. కిక్కిరిసిన జనాలతో నిండి ఉంటుంది. అలా లాడ్ బజార్ లో ఉన్న ఓ రెండస్తుల భవనంలో బట్టల షాపు బిజీగా ఉంది. అయితే, అనుకోకుండా ఆ బట్టల షాప్ లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో షాప్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో షాప్ లోని బట్టలతో పాటు ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. 

అగ్ని ప్రమాదం మీద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాప్ లో ఏమీ మిగలకుండా అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన బట్టల షాప్ ను స్థానిక పోలీసులు పరిశీలించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని...  ఆస్తి నష్టంతో పాటు ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల ఇలాగే సికింద్రాబాద్ బోయిగుడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోయిగుడాలోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి కొందరు కార్మికులు సజీవదహనం అయ్యారు. అగ్నిప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు వుండగా కేవలం ఒక్కరు తప్పించుకుని 11 మంది సజీవదహనమయ్యారు.  

click me!