‘బ్లాకు‘ బలి

First Published Dec 9, 2016, 10:37 AM IST
Highlights
  • వెలుగుచూస్తున్న నల్లధనం
  • బయటపడుతున్న బినామీలు
  • ఐటీ అధికారులకు షాకులు

 

తెలుగు రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచీలో మామూలగా ఉన్న... మనీ తరలింపులో మంచి ఫెర్ఫామెన్స్ చూపిస్తున్నాయి.ముఖ్యంగా అక్రమంగా డబ్బులు దాచుకోవడంలోనూ వాటిని గుట్టుగా తరలించడంలోనూ రెండు రాష్ట్రాలలో బడా బాబులు పోటీపడుతున్నారు.

 

పెద్ద నోట్లు రద్దు తర్వాత తమ దగ్గర గుట్టలుగా పోగైన బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు అన్ని మార్గాలు వెతుకుతున్నారు.

 

నిన్న చెన్నైలో రూ. 90 కోట్ల తో ఓ తెలుగు దేశం సన్నిహిత వ్యక్తి, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఐటీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

 

ఆయన దగ్గర మరో 100 కిలోల బంగారం కూడా బయటపడింది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆయన సన్నిహితుడని తెలుస్తోంది. చాలా సార్లు పోయిస్ గార్డెన్ కు వెళ్లివచ్చినట్లు తేలింది.

 

 

అంతకు ముందు హైదరాబాద్ కు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి ఐటీ అధికారులకు భారీ షాక్ ఇచ్చాడు. తన దగ్గర వేలకోట్లు ఉన్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అదంతా ఉట్టిదేనని తేల్చారు. అయితే లక్ష్మణరావు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు బడాబాబులకు బినామీ అని తేల్చారు.

 

 

తాజాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ లో కరెన్సీ కట్టలతో నిండిన లారీని పోలీసులు పట్టుకున్నారు.ఉదయం రోజుమాదిరిగా తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ లారీని ఆపారు. లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు లారీలో సోదా చేయగా లారీ నిండా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు లారీతో పాటు దాన్ని ఫాలో అవుతూ వచ్చిన జీపును కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కరెన్సీ నోట్ల లారీని పట్టుకున్న విషయంపై ఇప్పటి వరకు పోలీసు అధికారులెవరూ అధికారక ప్రకటన చేయలేదు.

click me!