కార్గిల్ యుద్ధంలో వీరమరణం: సుమోటోగా తీసుకొన్న హెచ్‌ఆర్‌సీ

Published : Jul 26, 2020, 06:24 PM IST
కార్గిల్ యుద్ధంలో వీరమరణం:  సుమోటోగా తీసుకొన్న హెచ్‌ఆర్‌సీ

సారాంశం

కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన విజయ్ బాబు కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకొంది


హైదరాబాద్: కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన విజయ్ బాబు కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకొంది.

సంగారెడ్డికి చెందిన విజయ్ బాబు  సైన్యంలో పనిచేసేవాడు. కార్గిల్ యుద్దంలో ఆయన మరణించాడు. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు.

ఈ కేసును హెచ్‌ఆర్‌సీ సుమోటోగా తీసుకొంది. విజయ్ బాబు కుటుంబసభ్యుల పరిస్థితిని చూసి ఈ కేసును సుమోటో గా తీసుకొంది. ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ లోపుగా  నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్ సీ ఆదేశించింది.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శిని విచారణకు ఆదేశించింది. కార్గిల్ యుద్దంలో  విజయం సాధించిన రోజునే హెచ్ఆర్‌సీ ఈ కేసును సుమోటోగా తీసుకొంది.

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన రోజున ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఇవాళ దేశం స్మరించుకొంది. ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.